కృష్ణా జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, కలెక్టర్ పి రాజాబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ప్రతిపక్ష పార్టీల నుండి అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. వారిలో జిల్లా కలెక్టర్ రాజాబాబు కూడా ఉన్నారు. 2023 ఏప్రిల్ 15న జిల్లా కలెక్టర్ గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. నాటి నుండి నేటి ఆయన అధికార నేతలకు అనుకూ లంగా పని చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ముందు కూడా మచిలీపట్నంలో స్థానిక MLA పేర్ని నాని ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున దొంగ పట్టాలు ఇచ్చారని ఆరోపణలు వినిపించాయి. ఈ అంశంపై టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో తాజాగా కలెక్టర్ పై వేటు వేసినట్లు తెలుస్తోంది.
కృష్ణాజిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, కలెక్టర్ పి రాజాబాబుపై ఈసీ వేటు
0
237
Previous article
Latest Articles
ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ఈ...
- Advertisement -
- Advertisement -


