దినేష్ కచ్వా అరాచకం నుండి తమను కాపాడి న్యాయం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతోంది ఆగ్రా స్వీట్స్ యజమాని కుమార్తె అనామిక ఘెష్. తమ పేరుతో ఉన్న స్వీట్స్ షాపు డాక్యుమెంట్లతోపాటు బంగారం, నగదు, మరో 2 కోట్ల విలువైన ప్రాపర్టీ డాక్యుమెంట్లను దినేష్ తీసుకువెళ్లాడని ఆరోపించిన ఆమె… షాప్ తన ఆధీనంలోకి తీసుకుని… తమపైనే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయింది అనామిక. ఇవే ఆరోపణలతో దినేష్ కచ్వాపై మధురానరగ్, బోరబండ, సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. తమను న్యాయం చేయాల్సింది పోయి… పోలీసులు కూడా కబ్జాదారు డికే వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ తమ గోడును పట్టించుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.
సీఎం రేవంత్‌కు ఆగ్రా స్వీట్స్ యజమాని కుమార్తె విజ్ఞప్తి
0
229
Latest Articles
ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ఈ...
- Advertisement -
- Advertisement -


