ఎగువన కురుస్తున్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కి వరద పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 14.2 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. బ్యారేజీ నుంచి 13 లక్షల క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేశారు. రానున్న 24 గంటలు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గోదావరిలో నదీ స్నానాలు చేయొద్దని సూచించారు. అలాగే మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం రానున్న 48 గంటలు నిర్వహించకుండా వాయిదా వేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి విజ్ఞప్తి చేశారు.