మణిపూర్ మరోసారి అల్లర్లతో అట్టుడికిపోతోంది. విద్యార్థుల ఆందోళనతో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇంఫాల్‌లో విద్యార్థులు చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి హింసాత్మకంగా మారింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేయడంలో డీజీపీ, స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్ విఫలమయ్యారని..వారిని తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో స్డూడెంట్స్ వారిపైకి రాళ్లు రువ్వారు. విద్యార్థులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో 40 మందికి పైగా విద్యార్థులు గాయపడటంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతారణం నెలకొంది.
రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులతో అలర్ట్ అయిన సర్కార్ ఇంటర్నెట్‌ను ఐదు రోజుల పాటు బంద్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. అలాగే ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, థౌబల్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. మరోవైపు అల్లర్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. 2 వేల మంది సీఆర్ పీఎఫ్ జవాన్లను దించింది. మరోవైపు మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తలతో కేంద్రంపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.