తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. ఉద్యోగాల విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ఇంటింటికీ ఉద్యోగం పేరుతో పదేళ్లపాటు బీఆర్ఎస్ మోసం చేసిందని.. దీంతో పదేళ్ల పాటు ఓయూకు వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నా.. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు ఒక్కొకటి అమలు చేస్తున్నామని చెప్పారు.