29.5 C
Hyderabad
Sunday, February 9, 2025
spot_img

ట్రంప్‌ మార్క్‌ పాలన… డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు

అమెరికా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌.. మొదటి రోజే తానేంటో శాంపిల్ చూపించారు. కుప్పలు కుప్పలుగా ఫైల్స్ ముందేసుకొని వరుసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయడం మొదలు పెట్టారు. అంతేకాదు.. గత బైడెన్ ప్రభుత్వం అమలు చేసిన పలు ఆదేశాలను సింగల్‌ సిగ్నేచర్‌తో రద్దు చేసి పడేశారు. పనిలో పనిగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు దిమ్మతిరిగి పోయేలా షాక్ ఇచ్చారు ట్రంప్‌.

అమెరికా అధ్యక్షులలోనే భిన్నమైన వ్యక్తి డొనాల్డ్‌ ట్రంప్‌. అందుకు తగ్గట్లుగానే గతంలో తానేంటో ఓసారి ప్రెసిడెంట్‌గా చూపించిన ఆయన.. ఇప్పుడు మరోసారి తన పాలనను ప్రజలకు రుచిచూపించడం మొదలు పెట్టారు. ప్రపంచ దేశాలకు దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్ అయ్యేలా చేయడం ప్రారంభించారు.

ఇలా ప్రమాణ స్వీకారం చేసి ప్రెసిడెంట్‌ సీట్లో కూర్చున్నారో లేదో అలా డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేయడం ప్రారంభించారు ట్రంప్‌. వరుసగా 8 ఆదేశాలపై సంతకం చేసిన అనంతరం పెన్నును జనంలోకి విసిరేసి ఉత్సాహపరిచారు. అంతేకాదు..మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ జారీ చేసిన 78 ఆదేశాలను ట్రంప్‌ వెనక్కు తీసుకున్నారు.

ట్రంప్‌ వెనక్కు తీసుకున్న నిర్ణయాలను ఓసారి పరిశీలిస్తే.. ప్రధానంగా ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగడం, ప్రభుత్వాన్ని ఆయుధంలా ప్రత్యర్థులపై వాడడం, వాక్‌ స్వేచ్ఛకు రక్షణ, జీవన వ్యయాల సంక్షోభంపై దృష్టి పెట్టాలని అన్ని ఏజెన్సీలకు మార్గదర్శకాలు, ప్రభుత్వ ఉద్యోగులు కచ్చితంగా కార్యాలయాలు వచ్చి పనిచేయడం లాంటి ఆదేశాలున్నాయి. కెనడా, మెక్సికోలపై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 25 శాతం అదనపు సుంకం విధించనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్‌.

బైడెన్ కార్యవర్గం వాక్‌ స్వేచ్ఛపై నియంత్రణ విధించడాన్ని ట్రంప్‌ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ నేషనల్ ఇంటెలిజెన్స్‌ విస్తృతంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్‌.

ప్రపంచ ఆరోగ్య సంస్థకూ షాకిచ్చాడు ప్రెసిడెంట్ ట్రంప్. WHO నుంచి వైదొలగుతూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ఎప్పటి నుంచో ఆగ్రహంగా ఉన్నారు ట్రంప్‌. ఈ క్రమంలోనే డబ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. ఇక, కృత్రిమ మేధ విస్తరణను నియంత్రిస్తూ బైడెన్ జారీ చేసిన ఆదేశాలను ట్రంప్‌ తొలగించారు. గత అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఏఐ అభివృద్ధి, ప్రయోగాలపై నియంత్రణలు ఉండేవి. ఇప్పుడు వాటిని తొలగించారు నూతన అధ్యక్షుడు ట్రంప్‌.

సరిహద్దు గోడ సామాగ్రిని విక్రయించాలన్న బైడెన్ ఆదేశాలను ట్రంప్‌ వెనక్కు తీసుకున్నారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో గత కొన్నాళ్లుగా ఈ గోడ సామాగ్రిని వేలంలో విక్రయిస్తోంది అమెరికా ప్రభుత్వం. ఇక, చైనా కంపెనీ టిక్‌టాక్‌ అమెరికా విభాగాన్ని విక్రయించేందుకు ట్రంప్‌ సర్కారు 75 రోజుల సమయం ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇవన్నీ ఒక ఎత్తైతే రష్యా అధినేతకు సైతం షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా ప్రెసిడెంట్‌ పుతిన్‌పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఉక్రెయిన్‌తో సంధి కుదుర్చుకోకుండా రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రష్యా త్వరలోనే పెద్ద చిక్కుల్లో పడనుంది అని అర్థం వచ్చేలా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. త్వరలోనే తాను పుతిన్‌ను కలవబోతున్నట్లు వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్‌. వీటితోపాటు మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు డొనాల్డ్ ట్రంప్.

Latest Articles

జనసేనకు తలనొప్పిగా మారిన కిరణ్ రాయల్ వ్యవహారం

తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ రాసలీలలకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఆ పార్టీని షేక్ చేస్తున్నాయి. యువతితో కిరణ్ రాయల్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్