తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణపై..మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు. తన రాజకీయ అనుభవం ముందు పిల్ల బచ్చా అంటూ విమర్శించారు. తనను ఏం చేయలేవంటూ మండిపడ్డారు. గెలిచి ఎనిమిది నెలలు గడిచేసరికి ఎమ్మెల్యే నిజస్వరూపం బయటపడిందని ఆగ్రహించారు. అధికార మదంతో ఎమ్మెల్యే మాట్లాడడం చూసి నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యపోతున్నారని విమర్శించారు. ఇంత వరకు ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు.