దేశవ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు

స్వతంత్ర వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా 150మెడికల్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీటి భవిష్యత్తు ప్రశ్నార్ధకంలో పడింది. ఫ్యాకల్టీ కొరత, నిబంధనలను పాటించకపోవడం వంటి కారణాలతో ఆయా కళాశాలల గుర్తింపును ‘నేషనల్ మెడికల్ కమిషన్’(ఎన్ఎంసీ) రద్దు చేయనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అర‌కొర వ‌స‌తుల‌తో ఆ కాలేజీలు న‌డుస్తున్నాయ‌ని, రూల్స్ విరుద్ధంగా ఆ కాలేజీలు ఉన్న‌ట్లు జాతీయ మెడిక‌ల్ క‌మీష‌న్ పేర‌న్కొన్న‌ది. ఇప్పటికే దేశ‌వ్యాప్తంగా 40 మెడిక‌ల్ కాలేజీల గుర్తింపును రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

గుర్తింపు కోల్పోయే మెడిక‌ల్ కాలేజీలు ఎక్కువ శాతం గుజ‌రాత్‌, అస్సాం, పుదుచ్చ‌రి, త‌మిళ‌నాడు, పంజాబ్‌, ఏపీ, త్రిపుర‌, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నాయి.ఇటీవ‌ల అండ‌ర్‌గ్రాడ్యువేట్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ బోర్డు నిర్వ‌హించిన త‌నిఖీల్లో మెడిక‌ల్ కాలేజీల గురించి తెలిసింది. ఎన్ఎంసీకి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ నెల రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో లోపాలు బయటపడ్డాయని, సీసీటీవీ కెమెరాలు, ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ హాజరు విధానాలు, ఫ్యాకల్టీ రోల్స్‌లోని గుర్తించినట్టు వెల్లడించాయి. అయితే, ఎన్ఎంసీ గుర్తింపు కోల్పోకుండా ఉండేందుకు సదరు కాలేజీలు అప్పీల్ చేసుకోవచ్చని, 30 రోజుల్లోగా సరైన సదుపాయాలు కల్పించి, అర్హతను అందుకోవచ్చని పేర్కొన్నాయి. ఇందుకు, ఎన్ఎంసీ అవకాశం ఇవ్వకపోతే, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖను సంప్రదించొచ్చని తెలిపాయి.

Latest Articles

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్