గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని కాప్రాలో నివాసముంటున్న సాఫ్ట్ వేర్ దంపతులు ఇద్దరు పిల్లలుతో కలిసి సూసైడ్ చేసుకున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్న సతీష్(39), వేద(35) దంపతులకు నిషికేత్(9), నిహాల్(5) పిల్లలు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడుతన్నారు. దీంతో ఆ దంపతులు పిల్లలతో సహా సైనేడ్ మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.