కాంగ్రెస్ పార్టీకి డి.శ్రీనివాస్ ఎంతో సేవ చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డీఎస్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. నిజామాబాద్ లో మాజీ పీసీసీ చీఫ్ డీఎస్ కు నివాళు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం నిజామాబాద్ చేరుకున్న సీఎం. డీఎస్ నివాసానికి వెళ్లారు. డీఎస్ పార్థివ దేహానికి నివాళు అర్పించారు. డీఎస్ కుమారులు, సంజయ్, అరవింద్ లను సీఎం రేవంత్ పరామర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డీఎస్ కీలక భూమిక పోషించారని గుర్తు చేశారు. ఆయన ప్రత్యేక చొరవతోనే 2004లో సోనియా తెలంగాణ ఏర్పాటు ఆమోదించారని అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో డీఎస్‌కు మంచి అనుబంధం ఉందని, బడుగు, బలహీన వర్గాల నేతలను ప్రోత్సాహించారని ప్రశంసించా రు. డీఎస్ భౌతికకాయం మీద కాంగ్రెస్ జెండా ఉండాలన్నది ఆయన చివరి కోరిక అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
డి.శ్రీనివాస్ కు నివాళులు అర్పించిన సీఎం రేవంత్
0
321
Previous article
Next article
Latest Articles
టీడీపీలో సరికొత్తగా నారీ శకానికి నాంది
తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధిష్టానం అత్యంత కీలకమైన, సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆలోచనల నుంచి పుట్టిన మహిళా సాధికారత వ్యూహానికి మహానాడు...
- Advertisement -
- Advertisement -


