స్వతంత్ర వెబ్ డెస్క్: నేడు ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రచారం చేయనున్నారు. నేడు సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో జరుగనున్న బీఆర్ఎస్ ఆశీర్వాద సభ, ఇల్లందులో నియోజకవర్గ బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు నేతలు. ఇక అటు సీఎం కేసీఆర్ ఇవాల్టి నుంచి రాజ్యశ్యామల యాగం చేయనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో మూడు రోజులపాటు సీఎం కేసీఆర్ దంపతులు ఈ యాగంలో పాల్గొననున్నారు. ఏపీ మరియు కర్ణాటక కు చెందిన 200 మంది పురోహితులు ఈ యాగానికి హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రోజుకు మూడు బహిరంగ సభలలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. హెలికాప్టర్లో తిరిగి… అన్ని నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు సీఎం కేసీఆర్.
నేడు ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రచారం
0
350
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


