35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో ఒప్పందాల అమలుపై సీఎం జగన్ సమీక్ష

స్వతంత్ర, వెబ్ డెస్క్: విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో ఒప్పందాల అమలుపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రస్తుతం పరిస్థితులపై సీఎం సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగ ప్రగతిలో ఎంఎస్ఎమ్ఈ లది కీలక పాత్ర అని అభివర్ణించారు. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కూడా ఈ రంగంలోనే ఉన్నాయని అన్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం మార్గదర్శకంగా వ్యవహరించాలన్న సీఎం.. ఈ విభాగానికి ఒక కార్యదర్శిని కూడా నియమించాలని ఆదేశించారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు రంగాలకు విశాఖ హబ్‌ కావాలని సీఎం ఆకాంక్షించారు. దీనికోసం ప్రత్యేక శద్ధ తీసుకోవాలని సూచించారు. ఐటీ ఆధారిత సేవలతో విశాఖనగరం ఖ్యాతి పెరుగుతుందని అన్నారు. తద్వారా ఐటీకి చిరునామాగా విశాఖ మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు నిరంతరం కొనసాగించాలని సీఎం సూచించారు.

 

 

 

Latest Articles

కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో రేవంత్‌ భేటీ.. మెట్రో ఫేజ్‌ 2 ఆమోదానికి వినతి

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఏడు కారిడార్ల‌తో కూడిన మెట్రో ఫేజ్‌-II స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్