గొడిచర్ల నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర

   అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. 19వ రోజు అనకాపల్లి జిల్లా గొడిచర్ల నైట్ స్టే పాయింట్ నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్రను ప్రారంభించారు. నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్‌ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుం టారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చింతపాలెం వద్దకు సీఎం జగన్‌ చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అసకపల్లి మీదుగా చిన్నయ­పాలెం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్‌ చేరుకుంటారు.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం గొడిచర్ల నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం సీఎం జగన్‌ను పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు కలిశారు. పార్టీ నేతలకు సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. అనంతరం గోడిచర్ల ప్రాంతం సీఎం జగన్‌ బస్సు యాత్రను ప్రారంభించారు.

Latest Articles

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్