ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను ముందు తీసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు పలు శాఖలపై సమీక్షలు, రివ్య్యూలు నిర్వహిస్తున్నారు. ఆయా శాఖల్లో అధికారుల పనితీరుపైనా ఆరా తీస్తున్నారు. ఇవాళ పలు కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షలు జరుపనున్నారు. రూరల్ వాటర్ సప్లై, జల్ జీవన్ మిషన్ మీద సమీక్ష చేయనున్నారు. అనంతరం సెర్ఫ్ పై సీఎం సమీక్ష చేస్తారు.
మధ్యాహ్నం ఉచిత ఇసుక విధానంలో పోర్టల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తరువాత ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్, రిలేషన్స్ పై రివ్యూ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు వెలగపూడి సచివాలయం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.