35.2 C
Hyderabad
Monday, May 13, 2024
spot_img

ఇచ్ఛాపురం వైసీపీలో వర్గ పోరు

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వైసీపీలో అంతర్గత కొట్లాటలు ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయా? టీడీపీకి కంచుకోట గా భావించే ఇచ్ఛాపురంలో ఈ సారి వైసీపీ పరిస్థితి ఏమిటి? మాజీ ఎమ్మెల్యే, గతంలో పార్టీ నుంచి సస్పెండ్ అయిన పిరియ సాయిరాజ్ అంత ప్రాధాన్యం ఎందుకు, అతడి భార్య జెడ్పీ చైర్మన్ విజయకే పార్టీ టికెట్ ఇవ్వడంతో పెల్లుబికిన అసంతృప్తిని పార్టీ ఎలా మేనేజ్ చేస్తుంది. నామినేషన్ల పర్వం మొదలైన ఈ తరుణంలో సీఎంజగన్ ఎలా స్పందిస్తారు. మెజారిటీ రెడ్డి, యాదవ సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ.. బలమైన అభ్యర్థిని నిలుపుతుందా.. ఇచ్ఛాపురంలో వైసీపీ లుకలుకలపై ఓ కథనం.

2009లో టిడిపి తరపున ఎమ్మెల్యేగా గెలిచాడు పిరియ సాయి రాజ్. నాలుగు సంవత్సరాలు తిరగకుండా వైసీపీ లో చేరిక. 2014లో వైసీపీ ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంతో జగన్ పై తిరుగుబాటు చేసి సస్పెండ్ అయ్యారు. మళ్లీ వైసిపిలో చేరి 2019లో ఎమ్మెల్యే టికెట్ సాధించి.. టిడిపి అభ్యర్థి బెందాళం అశోక్ చేతిలో ఓటమిపాలైనా ఇప్పటికీ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ భార్యకు టికెట్ ఇప్పించుకున్నాడు. సాయిరాజ్ సతీమణి ప్రస్తుత జడ్పీ చైర్మన్ పిరియా విజయను ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. దీంతో తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకత్వం అభ్యర్థిని మారుస్తుందా అన్నది సస్పెన్స్.

2019 ఓడిపోయినా సాయి రాజ్ కు వైసిపి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్తతో పాటు డీసీఎంఎస్ చైర్మన్ పదవి కట్టబెట్టింది. ఇచ్చాపురంలో టీడీపీకి చెక్ పెట్టే ఉద్దేశంతో సాయిరాజ్ భార్య పిరియా విజయకు జిల్లా జడ్పీ చైర్ పర్సన్ పదవి కట్టబెట్టింది వైసీపీ. ఐదు సంవత్సరాలుగా సాయిరాజ్ పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోగా చాలా ప్రాధాన్యం ఇవ్వడంపై వైసీపీ నాయకులంతా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో అధిష్టానం ఆలోచనలో పడిం దట. అయినా సాయిరాజ్ అధిష్టానాన్ని ఎలా మేనేజ్ చేసాడో కానీ అనూహ్యంగా సాయిరాజ్ సతీమణి ప్రస్తుత జడ్పీ చైర్మన్ పిరియా విజయను ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ ప్రకటించింది. దీంతో మొదటి నుంచి సాయిరాజ్ పై అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

   ఇచ్చాపురంలో నియోజకవర్గంలో ఇచ్చాపురం, కవిటి ,కంచిలి, సోంపేట మండలాలతో పాటు ఇచ్చాపురం మున్సిపాలిటీ వైసిపి నాయకులు సాయిరాజ్ చేపడుతున్న పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒక్క ఇచ్చాపురం మండలంలోని జడ్పిటిసి ,ఎంపీపీలు, కంచిలి ఎంపీపీ మాత్రమే సాయిరాజ్ తో ఉన్నారు. సోంపేట మండలం జడ్పిటిసి ఎంపీపీ, కంచిలి మండలంలోని జడ్పిటిసి తో పాటు ఎమ్మెల్సీ నర్తు రామారావు, బలమైన కేడర్ ఉన్న నర్తు నరేంద్ర, ఇచ్చాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి భర్త పిలక దేవరాజు, సీడప్ చైర్మన్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డి …వంటి వైసిపి నాయకులంతా పిరియా విజయ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారట. దీంతో పరిస్థితులు చక్కదిద్దే బాధ్యతను రీజనల్ కోఆర్డినేటర్ చిన్న శ్రీనుకు పార్టీ అధిష్టానం అప్పగించింది. సాయిరాజు పై ఆగ్రహంతో ఉన్న మున్సిపాలిటీ చైర్ పర్సన్ తో పాటు మిగతా వైసీపీ నాయకులు రీజనల్ కో ఆర్డినేటర్ చిన్న శ్రీను వద్ద బాహటంగానే పిరియా విజయ పై అసంతృప్తి వ్యక్తంచేశారు. టిడిపిని ఢీ కొట్టాలంటే ,బలమైన రెడ్డిక ,యాదవ సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేయాలని కోరారు. అప్పుడే టిడిపి అభ్యర్థి బెంధాళం అశోకుని ఓడించవచ్చని పలువురు నాయకులు… చిన్న శ్రీనుకు తెలియజేశారు. ఒకపక్క సాయిరాజ్ ను తప్పించాలని కోరుతుంటే. సాయిరాజ్ సతీమణి జడ్పీ చైర్మన్ విజయకు మళ్లీ ఎమ్మెల్యే సీటు ఇవ్వడం ఏంటని అధిష్టానానికి ప్రశ్నిస్తున్నారు. సాయిరాజ్ తండ్రి పిరియా రాజారావు నియోజకవర్గంలో షాడోగా వ్యవహరిస్తూ కార్యకర్తలకు ,నాయకులకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని కూడా ఫిర్యాదు చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గం తీవ్ర వ్యతిరేకత ఉన్నా సాయిరాజ్ పై పార్టీ ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియడం లేదని నాయకులు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. కొత్త వారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే గ్రూపు తగాదాలు లేకుండా ఇచ్చాపురం నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి బెందాళం అశోక్ పై విజయం సాధించవచ్చునని వైసిపి నాయకు లు అంటున్నా.. నామినేషన్ల ప్రక్రియ మొదలైన తరుణంలో అధికారపార్టీ అభ్యర్థి ని మార్చడం ఎంత వరకూ సాధ్యమో..

Latest Articles

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉయ్యూరు మండలం బోళ్లపాడు గ్రామంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య మాటా మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. విషయం తెలుసు కున్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్