Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు

  హైదరాబాద్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. వాతావరణం కూడా అనుకూ లించడం తో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా తరలివస్తున్నారు. హైదరాబాద్ లోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో సెలబ్రిటీలు ఓటు హక్కును వినియో గించు కున్నారు.

  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉదయం 7.15 నిమిషాలకే పోలింగ్ బూత్ కు చేరుకున్నారు. జూబ్లీహిల్స్ లోని టెలీఫోన్ ఎక్స్ ఛేంజ్ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అల్లు అర్జున్ క్యూ లైన్ లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకు న్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇక స్టార్ హీరో జూనియర్ ఎన్టీయార్ కూడా ఉదయాన్నే పోలింగ్ బూత్ కు చేరుకున్నారు. జూబ్లీహిల్స్‌ లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఉదయం 7.30కి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసేందుకు వచ్చారు ఎన్టీ ఆర్. ఆయనతో పాటు సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలిని వచ్చారు. క్యూలో నిల్చొని ఎన్టీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  మెగాస్టార్‌ చిరంజీవి కూడా సతీసమేతంగా ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్‌ క్లబ్‌ లోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. సతీమణి సురేఖ, కుమార్తె సుస్మితతో కలిసి వచ్చిన చిరంజీవి క్యూలైన్‌ లో నిల్చుని తన ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఓటు వేసిన అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లా డుతూ.”ఎప్పటిలాగే ఈసారి కూడా నా ఓటు హక్కును నా కుటుంబంతో కలిసి వినియోగించుకున్నాను. అందరికీ మళ్లీ మళ్లీ చెబుతున్నా, మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు అనేది హక్కు మాత్రమే కాదు బాధ్యత. ఆ బాధ్యత మన రాష్ట్ర, దేశ రూపురేఖలను మారుస్తుంది. మీకు న్యాయం చేస్తారు, సుపరిపాలన అందిస్తారు అని నమ్మకం ఉన్న నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన రాష్ట్రం, దేశం అభివృద్ధి కావడానికి మీ ఓటు ఉపయోగపడుతుంది. మీ ఓటు పవర్ చూపించండి.” అంటూ చిరంజీవి పిలుపునిచ్చారు. దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దుబాయ్‌ నుంచి నేరుగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేసి తన కర్తవ్యాన్ని నిర్వర్తించినట్లు చెప్పారు. తన సతీమణి రమతో కలిసి ఓటు వేసిన ఫొటోను రాజమౌళి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

   ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ హైదరాబాద్‌ లోని ఉప్పల్‌లో ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. ప్రజలందరూ తప్పక ఓటు వేయాలని కోరారు. హీరోలు శ్రీకాంత్, నందమూరి కల్యాణ్ రామ్, అక్కినేని నాగచైతన్య కూడా హైదరాబాద్ లో తమ ఓటు హక్కును వినియోగించుకు న్నారు.కొందరు సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. హీరో గోపీచంద్‌ ప్రకాశం జిల్లాలోని తన సొంతూరైన బొద్దు లూరివారి పాలెంలో ఓటు హక్కును వినియోగించు కున్నారు. అలాగే మంచు మోహన్‌ బాబు, ఆయన పెద్ద కుమారు విష్ణు తిరుపతిలోని రంగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకు న్నారు. ఇక హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ అక్కడే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఫిల్మ్ నగర్ కల్చర్ సెంటర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక హీరోయిన్ అనన్య నాగళ్ల ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని తన సొంతూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్