29.7 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

రేవంత్‌ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి

సి.నారాయణరెడ్డి 93వ జయంతి సందర్భంగా..తెలుగు సినిమా పరిశ్రమపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దర్ అవార్డులపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు తెలుగు పరిశ్రమ నుంచి స్పందన లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నిన్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. నంది అవార్డులలా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇవ్వాలనుకుంటోందని, కానీ తెలుగు ఇండస్ట్రీ నుంచి దీనిపట్ల స్పందన రాలేదనీ అన్నారు.

తన అంతట తాను అడిగినా కూడా ఎవరూ ముందుకు రావడం లేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డుల అంశంపై సినిమా పరిశ్రమ మౌనంగా ఉంటోందన్నారు. సినీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని చెప్పారు. గద్దర్ జయంతి సందర్భంగా..రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9న గద్దర్ అవార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పానన్నారు.

దీనిపై టాలీవుడ్ హీరో చిరంజీవి స్పందించారు. తెలంగాణ సీఎం చొరవ తీసుకుని సినిమా అవార్డులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం ట్వీట్ చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనను తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి ముందుకు తీసుకెళ్లాలని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్