Polavaram |పోలవరం ప్రాజెక్టు విషయంలో కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రప్రభుత్వం కీలక అంశాన్ని వెల్లడించింది. ప్రస్తుతానికి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమనిస్పష్టం చేసింది. పార్లమెంటులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనకాపల్లి ఎంపీ బి.సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరం(Polavaram )లో నీటిని నిల్వ చేయనున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని స్పష్టం చేశారు. తొలిదశ సహాయ, పునరావాసం మార్చి 2023 నాటికే పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే, తొలిదశలో 20వేల 946 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఖరారైందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఇప్పటివరకు కేవలం 11వేల677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం కల్పించినట్లు తెలిపారు. సహాయ, పునరావాసం మార్చి నాటికే పూర్తి కావాల్సి ఉన్నా… అందులో కూడా జాప్యం జరిగిందని కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా వెల్లడించారు.
Read Also: నా రాజీనామా ఆమోదం అనేది వైసీపీ ఆడే మైండ్ గేమ్: ఎమ్మెల్యే గంటా
Follow us on: Youtube Instagram