New Corona Cases |తాజా పరిస్థితులను చూస్తే.. దేశంలో కరోనా మళ్ళీ మొదలైనట్లే అనిపిస్తుంది. వెయ్యికి పైగా కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. తాజాగా, గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం బుధవారం ఒక్కరోజే 1,300 కొత్త కేసులు నమోదైనట్లు వెల్లడించింది. గత 140 రోజుల్లో ఇదే అత్యధికమని తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,605కు చేరగా.. కరోనా వైరస్ బారిన పడి ముగ్గురు మృత్యు ఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4.46 కోట్లు దాటింది. అదే సమయంలో 5,30,816 మరణాలు నమోదయ్యాయి.
Read Also: వ్యక్తిగత డేటా చోరీ.. ముఠా అరెస్ట్..
Follow us on: Youtube Instagram