సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారు అద్దం పగలకొట్టి నగదు ఖరీదైన మద్యం సీసాలను, కొంత నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జర్నలిస్ట్ కాలనీలో జరిగినట్లుగా సమాచారాం. జర్నలిస్ట్ కాలనీలోని సాయి గణేష్ ప్రొడక్షన్ పేరుతో ఉన్న కార్యాలయం వద్ద పార్కు చేసిన బెంజ్ కారులో చోరీ జరిగింది. గురువారం మధ్యాహ్నం సురేష్ కు చెందిన బెంజికారును కార్యాలయం ముందు నిలిపారు. శుక్రవారం ఉదయం చూడగ కారు ఎడమవైపు వెనుక సీటువద్ద అద్దం పగిలి ఉంది. వెళ్లి చూడగా.. లోపల ఉంచిన కారులో 50వేల నగదు 11 ఖరీదైన మద్యం సీసాలు దొంగలించారు. ఒక్కొక్క మద్యం సీసా ఖరీదు 28,000 ఉన్నట్లు తెలుస్తోంది. నగదు, మద్యం సీసాలు చోరీకి గురికావడంతో కార్యాలయం సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 

Latest Articles

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్‌ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్