ఈనెల 21న ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీఆర్ఎస్ నుంచి జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ అన్ని రాష్ట్రాల్లో తన కార్యాకలాపాలు ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనుంది. గుంటూరులో ఏర్పాటు చేసిన ఆ పార్టీ ఆఫీసును ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు కార్యకర్తలు నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. సీఎం జగన్ ప్రజా వ్యతిరేక విధానాలే లక్ష్యంగా రాష్ట్రంలో ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తాను ఆంధ్రాలో చాటుతామని తోట వెల్లడించారు.

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్