భోరున విలపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య

వరంగల్: తనపై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(MLA Rajaiah) కంటతడి పెట్టారు. కరుణపురంలో ఫాదర్ కొలంబో జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనను రాజకీయంగా ఎదురుకునే దమ్ములేక కొందరు ప్రత్యర్థులు దిగజారి రాజకీయాలు చేస్తున్నారన్నారు. అలాంటి వారు దమ్ముంటే తనపై పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. కూతురుతో సమాన వయసున్న మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా స్టేషన్ ఘనపూర్‌లో 5వ సారి కూడా భారీ మెజారిటీతో గెలిచి తీరుతానని స్పష్టంచేశారు. కాగా కొన్నిరోజుల క్రితం జానకీపురం సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పార్టీ అధిష్టానం ఆదేశాలతో నవ్య ఇంటికి వెళ్లిన రాజయ్య ఆమెకు క్షమాపణలు చెప్పారు.

Read Also: వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: కోటంరెడ్డి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్