నేడు బీజేపీ నేతలు, పవన్‌ కల్యాణ్‌ భేటీ.. పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం

స్వతంత్ర వెబ్ డెస్క్:  తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇటీవలే జనసేన పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 32 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఇటీవలే ప్రకటించింది. అయితే ఆ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుందనే ప్రచారం సాగుతోంది. కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై ఇవాళ క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. జనసేనతో పొత్తుపై బుధవారం స్పష్టత వస్తుందని బీజేపీ కీలక నేత చెప్పినట్లు సమాచారం. ఇవాళ దిల్లీలో బీజేపీ అగ్రనేతలు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సమావేశం కానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ కూడా ఈ చర్చల్లో పాల్గొననున్నారు. ఇందులో జీహెచ్‌ఎంసీ సహా పలు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులపై స్పష్టత వస్తుందనే టాక్ వినిపిస్తోంది. రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు ఇప్పటికే వ్యక్తపరచగా.. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు ఇటీవల పవన్‌ కల్యాణ్‌ను కలసి ఉమ్మడిగా పోటీ చేసే అంశంపై చర్చించిన విషయం తెలిసిందే.

Latest Articles

ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్‌

కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్