తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దూకుడు

    లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. నామినేషన్ల దాఖలుకు గడువు ఈ నెల 25వ తేదీతో ముగియనుండటంతో పలువురు బీజేపీ అగ్రనేతల ప్రచారంతో నిర్వహించనున్నారు. బీజేపీ అధినేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 25న రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్‌తో పాటు రెండు మూడు చోట్ల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో పార్టీ నిర్వహిస్తున్న ప్రచారం, ప్రజలకు చేరువయ్యేలా అమలు చేస్తున్న కార్యక్రమాలు, పోలింగ్ బూత్ స్థాయిలో జరుగుతున్న పనులు, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపై ఆయన సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాష్ట్ర పార్టీ ఇంచార్జి సునీల్ బన్సాల్ వివిధ సభల్లో పాల్గొంటారు. ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న తీరు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రచారంపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.

   పార్టీ లోక్‌సభ అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు కార్యక్రమాలకు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు హాజరుకానున్నారు. తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు గెలుచుకోవడంపై నాయకత్వం దృష్టి సారిం చింది. అందులోభాగంగా ప్రధాని మోదీ 3-4 సభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ నెలాఖరు లేదా మే 10న రాష్ట్రానికి వస్తారని పార్టీ నేతలు చెబు తున్నారు. జాతీయంగా ప్రచారానికి మోడీ, అమిత్ షా, నడ్డా, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు వస్తారని తెలుస్తోంది.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్