ఏపీ డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డ్ సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13 వేల 326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించింది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఆగస్టు 23న నిర్వహించిన గ్రామ సభలను వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్‌ను హైదరాబాద్‌లోని నివాసంలో పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. పవన్ కళ్యాణ్‌కి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ రికార్డు పత్రాన్ని అందజేశారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో గ్రామ సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు.
ప్రపంచ రికార్డ్ సాధించిన ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ
0
317
Previous article
Latest Articles
జనగణనలో ఓబీసీ కాలమ్ లేకపోవడంపై వివాదం
జనగణనలో కులగణన అంశం ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీ మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తోంది. ఈ...
- Advertisement -
- Advertisement -


