నేడు తెలంగాణకు అమిత్ షా.. చేవెళ్ల భారీ సభలో ప్రసంగించనున్న షా

Amit Shah | కేంద్ర హోమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు. చేవెళ్ల బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ఎన్నికలకు 9 నెలల సమయం మాత్రమే ఉన్నందున బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నేడు నిర్వహించబోయే చేవెళ్ల విజయ సంకల్ప సభలో అనేక విషయాలు ప్రస్తావించనున్నారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శల వర్షం గుప్పిస్తారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకై ఇప్పటినుంచే ప్రయత్నాలు చేసింది బీజేపీ. ఈ తరుణంలో నేటి అమిత్ షా వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కేంద్ర హోమంత్రి అమిత్ షా ఈ సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడినుండి నోవాటెల్ హోటల్‌కి వెళ్తారు. కాస్త రెస్ట్ తీసుకున్నాక… 4.30కి బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో సమావేశంలో పాల్గొని అసెంబ్లీ ఎన్నికలపై చర్చిస్తారు. అనంతరం 5.15కి నేరుగా చేవెళ్ల బహిరంగ సభకు వెళ్లి ప్రసంగిస్తారు. సభ ముగిశాక రాత్రి 7.45కి తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఢిల్లీ బయలుదేరుతారు.

Latest Articles

హీరో విజయ్‌ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు

హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపై నోటీసులు ఇచ్చింది.  HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్