కర్ణాటక కాంగ్రెస్ సభలో హీరో శివరాజ్ కుమార్ ప్రచారం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రచారానికి వాడుకుంటున్నాయి. అన్ని పార్టీల నుంచి పెద్ద పెద్ద నాయకులతో పాటు చోటా మోటా నాయకులు ప్రచారంలో నిమగ్నమైపోయారు. మరోవైపు సినీ హీరోలు కూడా ఆయా పార్టీల తరపున ప్రచారం చేస్తున్నారు.

ఈ క్రమంలో కన్నడ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ రాహుల్ గాంధీ ప్రచారసభలో పాల్గొన్నారు. చిత్ర‌దుర్గ‌లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. రాహుల్ గాంధీ అభిమానిగా ఇక్క‌డ‌కి వ‌చ్చాన‌ని తెలిపారు. రాహుల్ చేపట్టిన భార‌త్ జోడో యాత్ర‌ నుంచి ఎంతో ప్రేరణ పొందానని పేర్కొన్నారు.

శివరాజ్ కుమార్ భార్య గీతా శివరాజ్ కుమార్ మూడు రోజుల క్రితమే జేడీఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె సోదరుడు మాజీ సీఎం కుమారుడు సారెకొప్ప బంగారమధు బంగారప్ప సోరబ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ తరపున ప్రచారంలో శివరాజ్ కుమార్ చురుగ్గా పాల్గొంటున్నారు. కాగా మే 10వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Latest Articles

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్