నా జీవితంలో తొలిసారి ఓపెనింగ్‌కి వచ్చాను. కానీ ఎప్పుడూ ఇలాంటి స్టోర్‌కి రాలేదు.. అంత వండర్‌ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి ’’ అంటూ టాలీవుడ్ నటుడు హీరో నిఖిల్ సిద్ధార్ఢ్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఏర్పాటైన అద్యాయే ఫ్యాషన్ లేబుల్ స్టోర్‌ను టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ, టాలీవుడ్ నటి బిగ్ బాస్ 8 ఫేమ్ సోనియా ఆకులతో కలిసి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ఫ్యాషన్‌కు సంబంధించి పలు అంశాలను పంచుకున్నారు. అబ్బాయిలకు చొక్కా ప్యాంట్ తప్ప అంత ఎక్కువ ఏమీ ఉండవు. అమ్మాయిలకే ఎక్కువ స్టైల్స్ ఉంటాయి ఎందుకో అని తను అనుకునేవాడ్ని అని, అయితే ఈ స్టోర్ లోపలికి అడుగుపెట్టాక నా అభిప్రాయం మారిపోయిందని అన్నారు. .ఈ షోరూమ్‌ను చూస్తుంటే తనకు హైదరాబాద్‌లో ఉన్నట్టు లేదు మొరాకోలోనో ఉదయ్‌పూర్‌లోనో ఉన్నట్టుందని, ఇక్కడ అద్భుతమైన స్టైల్స్ కూడా అందుబాటు ధరల్లోనే ఉండడంతో తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఇకపై తాను కూడా క్లయింట్ అయిపోయానన్నారు.
ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు చంద్రేష్, రితేష్‌లు మాట్లాడుతూ.. రిటైల్‌లో మూడు దశాబ్దాల వారసత్వం ఉన్న గావిన్స్, భారతదేశపు గొప్ప హస్తకళల, చేనేతల సంప్రదాయాల వైభవానికి వేదికగా ఈ అద్వాయేను అందిస్తోందని పేర్కొన్నారు. తమ దుస్తుల శ్రేణి భారతదేశపు చేనేతల హస్తకళల వారసత్వానికి జేజేలు పలుకుతుందన్నారు. ఏక్ పరివార్, ఏక్ పరంపరా…సబ్కీ అనోఖి కహానీ అనే తమ థీమ్‌కు అనుగుణంగా అద్వాయే ఆవిష్కరణ ఒక స్టోర్ ఓపెనింగ్ కంటే ఎక్కువ అనీ, ఇది ఫ్యాషన్, సంస్కృతీ సంప్రదాయాల మేలు కలయికల అనుభవానికి ప్రారంభమన్నారు. ఈ కార్యక్రమంలో మిస్ టీన్ ఇండియా బిపాసా, రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్స్ వ్యవస్థాపకులు సాత్విక గుప్తా, సిటీ పేజ్3, సోషలైట్స్‌లు పాల్గొన్నారు.