ఇజ్రాయెల్ దళాలకు ఎదురుదెబ్బ

   గాజాపై వరుస దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ గాజాలో తమ దళాలపై జరిగిన దాడిలో ఎనిమిది మంది సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది. పేలుడు కారణంగా సైనికులు చనిపోయినట్లు పేర్కొంది. అయితే ఈ ఘటనకు సంబం ధించి పూర్తి వివరాలు ప్రకటించలేదు. మృతి చెందిన వారిలో కంబాట్‌ ఇంజినీరింగ్‌ కార్ప్‌కు చెందిన డిప్యూటి కంపెనీ కమాండర్‌ వాసీం మహమూద్‌ ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో గాజాలో హమాస్‌ మిలిటెంట్లు జరిపిన దాడిలో ఒకేసారి 21 మంది ఇజ్రాయెల్‌ సైనికులు మరణించారు. ఈ తర్వాత భారీ సంఖ్యలో చనిపోవడం ఇది రెండోసారి. హమాస్‌తో యుద్ధంలో ఇప్పటివరకు 307 మంది ఇజ్రాయెల్‌ సైనికులు మృతి చెందారు. సైనికులు రాత్రిపూట తమ ఆపరేషన్‌ ముగించుకొని, విశ్రాంతి కోసం స్వాధీనం చేసుకున్న భవనాలకు కాన్వాయ్‌లో వెళ్తుండగా, ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడుతో ఆర్మర్డ్‌ కంబాట్‌ ఇంజినీరింగ్‌ వెహికల్‌లో ఉన్న సైనికులు చనిపోయారు.

Latest Articles

రాయదుర్గంలో అర్ధరాత్రి రేసింగ్.. కానిస్టుబుల్ కు గాయాలు

హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అర్ధరాత్రి యువకుల రేసింగ్ కలకలం రేపింది. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో రాష్ డ్రైవింగ్ చేస్తోంది యువత. వీకెండ్స్ లో పోలీసుల కళ్ళు గప్పి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్