30.5 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

అమెరికాలో ప్రధానికి అరుదైన గౌరవం

స్వతంత్ర వెబ్ డెస్క్: అమెరికాలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌రికొత్త రికార్డు నెల‌కొల్ప‌నున్నారు. అక్క‌డి చ‌ట్ట‌స‌భ‌ల్లో రెండోసారి ప్ర‌సంగించ‌నున్న భార‌త ప్ర‌ధానిగా మోదీ రికార్డు సృష్టించ‌నున్నారు. ఈనెలలోనే మోదీ అమెరికాలో ప‌ర్య‌టించాల్సి ఉంది. త‌మ దేశ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చే మోదీకి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ నుంచి అరుదైన ఆహ్వానం ల‌భించింది. జూన్ 22వ తేదీన వైట్ హౌస్‌లో ఏర్పాటు చేసే విందుకు హాజ‌రు కావాలంటూ జో బైడెన్‌, అమెరికా ప్ర‌థ‌మ మ‌హిళ జిల్ బైడెన్ నుంచి మోదీకి ఆహ్వానం అందిన విష‌యం తెలిసిందే.

తాజాగా, అమెరికా ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించాలంటూ మోదీకి వైట్ హౌస్ స్పీక‌ర్ కెవిన్ మెక్‌కార్తీ, సెనేట్ మెజారిటీ లీడ‌ర్ చ‌క్ షూమ‌ర్‌, సెనేట్ రిప‌బ్లిక‌న్ లీడ‌ర్ మిచ్ మెక్కాన‌ల్ త‌దిత‌రులు ఆహ్వానించారు. ప్ర‌ధాని మోదీ ట్విట‌ర్ వేదిక‌గా ఆ విష‌యాన్ని పంచుకున్నారు. అమెరికా ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించేందుకు తాను ఉత్స‌క‌త‌తో ఉన్నాన‌ని, ఇది త‌న‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జాస్వామిక విలువ‌ల ఆధారంగా భార‌త్, అమెరికా బంధం ఏర్ప‌డింద‌ని, ప్ర‌పంచ శాంతికి రెండు దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నాయ‌ని అన్నారు. యూఎస్ కాంగ్రెస్ సంయుక్త స‌మావేశంలో మోదీ ప్ర‌సంగించ‌డం ఇది రెండోసారి. జూన్ 2016లో అమెరికా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆయ‌న యూఎస్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని విన్‌స్ట‌న్ చ‌ర్చిల్‌, ద‌క్షిణాఫ్రికా అధ్య‌క్షుడు నెల్స‌న్ మండేలాల‌కు రెండు సార్లు ఈ అరుదైన గౌర‌వం ద‌క్కించింది. తాజాగా ప్ర‌ధాని మోదీకి ఈ అరుదైన గౌర‌వం ద‌క్క‌నుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్