మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

తనపై కోపం కోపం ఉంటే చంపాలని.. అంతేకానీ ఇలాంటి దుష్ప్రచారం చేయవద్దని మాజీమంత్రి మేరుగు నాగార్జున కోరారు. తనను శారీరకంగా లోబరుచుకుని, ఉద్యోగం ఇప్పిస్తానని 90లక్షలు తీసుకున్నట్లు ఆరోపిస్తూ విజయవాడకు చెందిన మహిళ ఫిర్యాదు చేయడంపై మేరుగు నాగార్జున స్పందించారు. రాజకీయాల్లో ఎదుగుతున్న దళితుడిని టార్గెట్‌ చేస్తున్నారని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదని.. ఏ పరీక్షకైనా సిద్ధమని తెలిపారు. ఈ విషయంలో తప్పు ఉందని తేలిస్తే ఉరిశిక్షకు అయినా సిద్ధమని స్పష్టం చేశారు.

వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించారని విజయవాడకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మేరుగు నాగార్జున 90 లక్షలు తీసుకున్నాడని విజయవాడకు చెందిన బాధితురాలు తాడేపల్లి పీఎస్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖలో ఓ గిరిజన టీచర్‌ను స్లో పాయిజన్‌ ద్వారా చంపేశానని.. తనకు అదే గతి పడుతుందని మేరుగు నాగార్జున పీఏ మురళి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తనకు రావాలని 90 లక్షలను ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్