నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం 100రోజుల వేడుకను జరుపుకోనుంది. మలినేని గోపిచంద్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ నిలిచింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. మరో రెండు రోజుల్లో ఎనిమిది కేంద్రాల్లో విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 23న 100డేస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. అయితే ఈవెంట్ ఎక్కడ నిర్వహించనున్నారనేది మాత్రం చెప్పలేదు. ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా బాలయ్య గత చిత్రం ‘అఖండ’ కూడా 100 రోజుల వేడుకను జరుపుకుంది.
గ్రాండ్ గా ‘వీరసింహారెడ్డి’ 100రోజుల వేడుక
0
462
Previous article
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


