చిత్తూరు జిల్లాలో దారుణం.. యువతి గొంతుకోసి హత్య చేసిన యువకుడు

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తమ ప్రేమను కాదంటే చాలు సైకోల్లాగా ప్రవర్తిస్తూ యువతుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా ఓ సైకో చేతిలో మరో యువతి బలైంది. చిత్తూరు జిల్లా కొండమిట్ట ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వేలూరు రోడ్డులోని ఓ బ్యూటీ పార్లర్ లో ప్రశాంతి అనే యువతి పనిచేస్తోంది. అక్కడికి వచ్చిన చక్రవర్తి అనే యువకుడు ఆమె గొంతుకోసి హత్యచేశాడు. అనంతరం తానూ గొంతు కోసుకున్నాడు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కొనఊపిరితో ఉన్న యువకుడిని ఆస్పత్రికి తరలించారు. మృతురాలు చిత్తూరు తాలూకా స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నాగరాజు కుమార్తెగా గుర్తించారు. తమ కుమార్తె మతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Latest Articles

కోదాడలో కల్తీ పాలు, పెరుగు వ్యాపారం.. స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడ్డ బాగోతం

కోదాడలో కల్తీ పాలు, పెరుగు వ్యాపారం కలకలం రేపింది. పాలలో కెమికల్స్, గమ్ము, మిల్క్ పౌడర్ మిక్సింగ్‌ చేస్తూ కేటుగాళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో అక్రమార్కుల బాగోతం బయటపడింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్