20.7 C
Hyderabad
Tuesday, February 17, 2026
spot_img

తెలంగాణకు 13 ఉత్తమ అవార్డులు… హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

CM KCR | తెలంగాణ పంచాయతీలకు కేంద్ర అవార్డులు రావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యున్నతంగా మన గ్రామాలు ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పచ్చదనం, పరిశుభ్రత, అభివృద్ధిలో అన్నిరాష్ట్రాలకంటే ముందే నిలిపామన్నారు. కేంద్రం ప్రకటించిన 46 ఉత్తమ అవార్డుల్లో 13 మన రాష్ట్రానికే దక్కడం గర్వకారణమని అన్నారు. స్వచ్ఛ గ్రామాల పోటీల్లో దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు అవార్డుల కోసం పోటీ పడ్డాయని అన్నారు. ఇందులో కేవలం 46 గ్రామాలకు మాత్రమే అవార్డులు వరించాయన్నారు.

అంతేకాకుండా దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లో 9 విభాగాలకు గాను తెలంగాణ 8 విభాగాల్లో అవార్డులు సాధించడం అత్యంత సంతోషనీయమన్నారు. మొత్తం జాతీయ అవార్డుల్లో 30 శాతం తెలంగాణనే సాధించడం మనందరికీ గర్వకారణం అన్నారు. 13 ర్యాంకుల్లోనూ నాలుగు మొదటి 4 ర్యాంకులు రావడమనేది యావత్తు తెలంగాణకు సంతోషాన్నిస్తుందని అన్నారు. సుదీర్ఘ కాలంగా అనేక కష్టాలను ఎదుర్కొని, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ.. నేడు పరిశుభమైన గ్రామాలను అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో, ప్రగతిలో దూసుకుపోతుంతే ఓర్వలేకే ప్రతిపక్షాలు వితండవాదం చేస్తున్నాయని  మండిపడ్డారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్