38.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో వల్లభనేని అనిల్ ప్యానెల్ ఘనవిజయం

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్ ఘన విజయాన్ని సాధించింది. 2023-2025 సంవత్సరానికి గాను ఫెడరేషన్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రటరీ గా పీఎస్ఎన్ దొరను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో 24 కార్మిక సంఘాల నాయకులు, కార్మిక సోదర సోదరిమణులు పాల్గొన్నారు. అలాగే కోశాధికారిగా పోటీ చేసిన సురేష్ గెలుపొందారు. కోశాధికారి పదవికి ఫెడరేషన్ మొత్తం ఓట్లు 72 కాగా… ఇందులో 60 ఓట్లు పోలయ్యాయి. అందులో సతీష్ కు 16 ఓట్లు రాగా.. సురేష్ కు 44 ఓట్లు వచ్చాయి. 28 ఓట్ల మెజారిటీతో సురేష్ కోశాధికారిగా గెలుపొందారు.

ఈ సందర్బంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ… మరోసారి తమ ప్యానెల్ పై నమ్మకం ఉంచి ఘన విజయాన్ని అందించిన కార్మిక సోదర సోదరీమణులకు, 24 కార్మిక సంఘాల నాయకులకు,అభివృద్ధికి తహకరించిన శ్రేయోభిలాషులకు ధన్యవాదములు తెలిపారు. సినిమా ఇండస్ట్రీ లో ఉన్న 25 వేల మంది సినిమా కార్మికుల కష్టనష్టాలు తెలిసిన నాయకులుగా మరొకమారు మమ్మల్ని కార్మికులు గుర్తించినందుకు సంతోషంగా ఉంది. మా మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరిని కలుపుకొని ముందుకు సాగుతానని అన్నారు. ఈ గెలుపు 24 సంఘాల సినిమా కార్మికులదేనని తెలియజేస్తూ… ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు కొమర వెంకటేష్ కి, వికాస్ కు ఈ గెలుపును అంకితం చేశారు.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్