దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ 10వేలపైనే కేసులు రావడం ఆందోళన కల్గిస్తోంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 10,753 కేసులు నమోదుకాగా.. 27మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 53,720కి చేరుకోగా..ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 5,31,064కి చేరుకుంది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 6.78శాతంగా నమోదైంది. కేసుల పెరుగుదలకు XBB.1.16 వేరియంట్ కారణమని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు. కాగా శుక్రవారం 11,109 కొత్త కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
దేశంలో ఆగని కరోనా విజృంభణ.. 27మంది మరణం
0
393
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


