దేశంలో మూడు వేలకు పైగా కేసులు.. కారణం అదేనా!

CORONA IN INDIA | దేశంలో గతకొన్ని రోజుగా శాంతించిన కరోనా… మళ్లీ విజృంభించేందుకు సిద్ధం అయింది. ఇందుకు నిదర్శనం రోజురోజుకు పెరుగుతున్న కేసులే. దాదాపు ఆరు నెలల తర్వాత మరోసారి 3 వేల మందికి వైరస్‌ సోకడంతో భయాందోళనలో పడ్డారు దేశ ప్రజలు. ఫస్ట్ వేవ్పె, సెకండ్ వేవ్ లోనే అల్లకల్లోలం సృష్టించిన ఈ వైరస్.. ఇక థర్డ్ వేవ్ లో ఎలా తన ప్రతాపాన్ని చూపిస్తుందోనని ఖంగారు పడుతున్నారు. ఈ మధ్య రోజు రోజుకు కరోనా కేసులో మూడు వేలకు పైగానే నమోదవుతున్నాయి. దీనికి గల కారణం ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ XBB.1.16 రూపాంతరమేనని అంచనా వేస్తున్నారు ఆరోగ్య నిపుణులు;. ఇప్పటికే పలు అధ్యయనాలు వేరియంట్‌ ఇన్ఫెక్టివిటీ రేటును చూపుతున్నాయని తెలుపుతున్నాయి

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎపిడెమియోలాజికల్ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం… గత 28 రోజుల్లో భారతదేశంలో కోవిడ్ -19తో మృతి చెందిన వారి సంఖ్య 114 శాతానికిపైగా పెరిగింది. అదే సమయంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 437 శాతం పెరిగింది. అయితే ఈ కేసుల పెరుగుదలకు, మృతులకు సంభందించి ఇంకా కారణాలు తెలియరాలేదు. ఆగ్నేయాసియా ప్రాంతం నుంచి 27వేల కంటే ఎక్కువగా కొత్త కేసులునమోదవ్వగా… భారత్‌ తర్వాత మాల్దీవుల్లో 129శాతం, నేపాల్‌లో 89శాతం కేసులు పెరిగినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్