Nikhat Zareen |వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌ కు మరో స్వర్ణం.. చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి..

Nikhat Zareen |వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌ మరో స్వర్ణం పతకం సాధించింది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సీనియర్ బాక్సింగ్‌(48-50 కేజీలు) విభాగంలో తెలంగాణకు చెందిన నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతకం సాధించింది. దీంతో సీనియర్ విభాగంలో భారత మాజీ బాక్సర్ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచ టైటిల్ గెలిచిన రెండో భారత బాక్సర్‌గా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ఫైనల్స్‌లో 5-0 తేడాతో వియత్నాం బాక్సర్‌ న్యూయెన్ టి తామ్‌పై నిఖత్ విజయం సాధించింది. గతేడాది ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హమ్ వేదికగా జరిగిన 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో కూడా నిఖత్ గోల్డ్ మెడల్ సాధించింది. అప్పుడు కూడా ఆమె 5-0 తేడాతోనే నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌నాల్‌ని ఓడించి విజేతగా నిలిచింది. తద్వారా భారత్ తరఫున సీనియర్ బాక్సింగ్‌లో మేరికోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు గోల్డ్ మెడల్ సాధించిన రెండో ప్లేయర్‌గా.. అలాగే వరుసగా రెండో ఏడాది కూడా స్వర్ణపతకం సాధించిన రెండో బాక్సర్‌గా నిఖత్‌ జరీన్ రికార్డు నెలకొల్పింది. మరోవైపు బాక్సింగ్‌లో రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన
తొలి తెలుగు అమ్మాయిగా కూడా నిఖత్ నిలిచింది.

ఇప్పటికే మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌ రెండు బంగారు పతకాల్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 48 కేజీల విభాగం నీతు గాంగాస్‌ , 81 కేజీల విభాగంలో స్వీటీ బూర గెలవగా.. తాజాగా నిఖత్(Nikhat Zareen) పసిడి పతకంతో ఏడాది భారత్ ఖాతాలో 3 బాక్సింగ్ గోల్డ్ మెడల్స్ చేరాయి.

Read Also: మీరు సుద్ద పూసలే అయితే… CBIతో విచారణ చేయించు: వై.ఎస్.షర్మిల

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్