MLA Nallamothu Bhaskar Rao hot comments | మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మరోసారి నోరుజారారు. కాంగ్రెస్ నేతలకు ఓట్లు ఎందుకు వేయాలి. నాలుగు చీరలిచ్చే కాంగ్రెస్ నాయకుడికి ఓట్లు వేయాలా? అయితే మేం వేసిన రోడ్లపై నడవకండంటూ మండిపడ్డారు నల్లమోతు భాస్కర్ రావు. గతంలో అడవిదేవులపల్లి మండలంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి విమర్శలకు గురయ్యారు. తాజగా, నేడు కూడా ఈ వ్యాఖ్యలు చేయడంతో నల్గొండ రాజకీయాల్లో నల్లమోతు వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.