ఏపీలో జరుగుతున్న మున్సిపల్ పోలింగ్ సందర్భంగా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా పులివెందుల సహా పలు మున్సిపాలిటీలలో టీడీపీ పార్టీ శ్రేణులు అరాచకాలకు పాల్పడుతున్నాయని, తమ ప్రజాస్వామ్య హక్కు అయిన ఓటును వేయకుండా అడ్డుకుంటున్నారని ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సామాన్య ఓటర్లను, వైసీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అధికార పార్టీ అండ చూసుకుని కొందరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని, చాలా పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లను లోపలికి వెళ్లనివ్వకుండా రాళ్లు, కర్రలతో భయాందోళనలు సృష్టిస్తున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఓటర్లకు రక్షణ కల్పించాల్సిన పోలీసు యంత్రాంగం కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తోందని, ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఓటర్లను వెనక్కి పంపుతోందని ఆరోపిస్తూ పలు ప్రాంతాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసనలకు దిగారు. దొంగ ఓట్లు వేసుకునేందుకే తమను బూత్‌ల వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషన్‌ను డిమాండ్ చేస్తున్నారు.
ఏపీ మున్సిపల్ పోలింగ్‌లో ఉద్రిక్తత.. ఓటర్లపై టీడీపీ శ్రేణుల దాడుల ఆరోపణ.ఓటర్లను పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని స్థానికుల ఆగ్రహం. రాళ్లు, కర్రలతో భయాందోళనలు సృష్టిస్తున్న పచ్చమూకలు.. పలువురికి గాయాలు.పోలీసుల తీరుపై ప్రజల నిరసన.. పలు కేంద్రాల వద్ద ఓటర్ల బైఠాయింపు.స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి కల్పించాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏపీ మున్సిపల్ పోలింగ్ సందర్భంగా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
Latest Articles
- Advertisement -


