ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాతో కలిసి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ ప్రదర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణపై అమిత్ షా.. పోలీసు అధికారులతో చర్చలు జరిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు చేపడుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లపై చర్చ
0
7
Previous article
Next article
Latest Articles
బాండ్లపై సంతకాలు చేసే ప్రసక్తే లేదన్న నేహా బోరా
శాంతియుత నిరసనలు తెలిపే ప్రజాస్వామ్య హక్కును అణచివేయడానికే అధికారులు ‘పీస్ బాండ్ల’ను ఆయుధంగా వాడుకుంటున్నారని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా విమర్శించారు. రాజ్యాంగం పౌరులకు అందించిన నిరసన...
- Advertisement -
- Advertisement -


