కర్ణాటకలో రోడ్డు ప్రమాదం – ముగ్గురి దుర్మరణం

కర్ణాటకలో జరిగిన  హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తు చెరువులో బురదలోకి దూసుకెళ్లిన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన కొడగు జిల్లా మడికెరి తాలూకా పరిధిలోని మాల్యారె ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిద్ధాపుర హైస్కూల్ పైసారికి చెందిన విజేశ్‌ , అతని భార్య ప్రమిత , తమ నాలుగేళ్ల చిన్న కూతురు లియాతో కలిసి సమీపంలోని మాల్యారె వద్ద ఉన్న బంధువుల ఇంటికి కారులో వెళ్లారు. అక్కడ తమ పెద్ద కూతురిని బంధువుల ఇంటి వద్ద వదిలిపెట్టి, చిన్న కూతురు లియాతో కలిసి తిరిగి తాము పనిచేస్తున్న ఎస్టేట్‌కు బయలుదేరారు.
అయితే, వారు ప్రయాణిస్తున్న కారు చెరువు కట్ట రోడ్డుపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు.. కారు అదుపుతప్పి కిందకు జారింది. దీంతో అదుపుతప్పిన కారు నేరుగా చెరువులోని లోతైన బురదలోకి దిగబడిపోయింది. ఆ సమయంలో రాత్రి వేళ కావడంతో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం, చీకటి కారణంగా ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. కారు పూర్తిగా బురదలో కూరుకుపోవడంతో తీవ్రంగా గాయపడిన బాధితులు బయటకు రాలేకపోయారు. ఊపిరాడక కారులోనే విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలారు. బుధవారం ఉదయం ఆ దారిన వెళ్తున్న ఎస్టేట్ కార్మికులు చెరువులో కూరుకుపోయిన కారును గమనించి వెంటనే పోలీసులకు, స్థానికులకు సమాచారం అందించారు.
స్థానికుల సహాయంతో కారులోని ముగ్గురిని బయటకు తీసి చికిత్స నిమిత్తం సిద్ధాపుర ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మడికెరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కన్న తల్లిదండ్రులు, తోబుట్టువు ఒకేసారి రోడ్డు ప్రమాల రూపంలో దూరమవ్వడంతో బంధువుల ఇంటి వద్ద సురక్షితంగా ఉన్న పెద్ద కూతురు ఇప్పుడు ఒంటరిదై అనాథగా మిగిలిపోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Latest Articles

ఢిల్లీలో విచక్షణారహిత కత్తిపోట్లు.. 

దేశ రాజధాని ఢిల్లీలో బాలురు, యువకుల మధ్య చిన్న చిన్న వివాదాలు తీవ్ర హింసాత్మకంగా మారి ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా పితంపుర మరియు సీలంపూర్ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు కత్తిపోట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్