22ఏ భూముల సమస్యల పరిష్కారంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. 22ఏ భూముల పరిష్కారానికి అధికారులతో హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ హై లెవల్ కమిటీకి సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్‌కుమార్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కమిటీ సభ్యులుగా లా సెక్రటరీ పాపిరెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు ఉండనున్నారు.
సర్కారు ఏర్పాటు చేసిన ఈ కమిటీ 22ఏ కింద ఉన్న భూములకు సంబంధించిన సమస్యలను పరిశీలించనుంది. భూ సమస్యలను గుర్తించి వాటిని వేగంగా పరిష్కరించేలా ఈ కమిటీ చర్యలు చేపట్టనుంది.


