ఢిల్లీ పాలకుల చేతిలో తెలంగాణ తల్లడిల్లుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ పాత్ర మరువలేనిదని కేటీఆర్ అన్నారు. ఏ రంగంలోనైనా జయశంకర్‌కు అద్భుత అవగాహన ఉందని కేటీఆర్ కొనియాడారు. జయశంకర్‌ను ఏ విషయం అడిగినా ఓపిగ్గా విని సమాధానం ఇచ్చేవారని కేటీఆర్ అన్నారు. ఢిల్లీకి సామంతులు ఉండేవారు కాదు.. స్వతంత్రులుగా ఉండేవారిని జయశంకర్ కోరుకున్నారని కేటీఆర్ వివరించారు. ఎట్టిపనికైనా.. మట్టిపనికైనా స్వరాష్ట్రం వాళ్లే ఉండాలన్నారు. ఢిల్లీ నేతలు చెప్పినట్లు రాష్ట్రంలో పాలన నడుస్తోందని కేటీఆర్ అన్నారు. రేవంత్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రం కోసం యాచిస్తున్నారన్నారు.
ఢిల్లీ పాలకుల చేతిలో తెలంగాణ తల్లడిల్లుతోంది- కేటీఆర్
0
67
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


