అనిల్ రావిపూడి.. ప్రయోగం చేయబోతున్నారా..?

హిట్ మిషన్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది అనిల్ రావిపూడి. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకీ, కళ్యాణ్ రామ్ కాంబోలో క్రేజీ మల్టీస్టారర్ చేస్తున్నాడు. సంక్రాంతికి ఈ మూవీ భారీ స్థాయిలో థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. అనిల్ రావిపూడి నెక్ట్స్ ఓ ప్రయోగం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా.. మరో సినిమాకి కూడా ఓకే చెప్పాడు అనేది ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. అనిల్ రావిపూడి చేయబోతున్న ప్రయోగం ఏంటి..? మరో సినిమా ఎవరితో..?

హిట్ మిషన్ అనిల్ రావిపూడి కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో హీరోల పాలిట అనీల్ రావిపూడి బంగారు బాతులా మారిపోయారు. హీరోలంతా ఇప్పుడు అత‌డి కోసం క్యూ క‌డుతున్నారంటే అతిశ‌యోక్తి కాదు. అయితే ఇప్పటి వరకు ప్రేక్షకుల్ను ఎంటర్ టైన్ చేసేలా ఎంటర్ టైనర్స్ అందిస్తున్న అనిల్ ఇప్పుడు రూటు మార్చబోతున్నాడని.. సరికొత్త ప్రయోగాలు చేయాలని ఫిక్స్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం క్రేజీ మల్టీస్టారర్ చేస్తున్న అనిల్.. పక్కా ప్లానింగ్ తో అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ చేస్తూ సంక్రాంతికి మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

అనిల్.. ఎప్పుడూ ఒకే జోనర్‌లో కాకుండా కంఫర్ట్ జోన్ నుండి పూర్తిగా బయటపడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలుగు తెరపై వినూత్నమైన యానిమేషన్ సినిమాను తెరకెక్కించడానికి సన్నా హాలు చేస్తున్నారట. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాల‌తో రానున్న యానిమేషన్ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన కెవిఎన్ సంస్థ నిర్మించనుందని సమాచారం.

యానిమేషన్ మూవీతో పాటు మరో సినిమాకి అనిల్ రావిపూడి ఓకే చెప్పారట. అది ఏంటంటే.. బాలయ్యతో మూవీ అని తెలిసింది. బాలయ్య, అనిల్ రావిపూడి కలిసి భగవంత్ కేసరి అనే సినిమా చేయడం.. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అందుకనే బాలయ్య, అనిల్ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారట. అది ఇప్పుడు ఫిక్స్ అయ్యిందని.. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని తెలిసింది. మొత్తానికి దర్శకుడిగా అనిల్ రావిపూడి.. తన పరిధిని మరింత విస్తృతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేయబోతున్నారు. మరి.. ఈ ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి.

Latest Articles

దిల్‌సుఖ్‌నగర్‌ రోడ్డుపై రేవంత్‌రెడ్డి పేరుతో ఓవర్‌స్పీడ్‌తో కారు హల్‌చల్‌

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్ రోడ్లపై తెలంగాణ టైగర్ పేరుతో ఓవర్ స్పీడ్‌తో  ఓ కారు హల్‌చల్‌ చేసింది. కారు నెంబర్ ప్లేట్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉంది. కారు వెనుక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్