మాస్ మహారాజా రవితేజ.. ఇరుముడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే.. రెగ్యులర్ మాస్ సినిమాలు కాకుండా డిఫరెంట్ స్టోరీస్‌తో సినిమాలు చేయాలని ఫిక్సైన మాస్ రాజా.. ఇప్పుడు ఓ మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ మల్టీస్టారర్ మూవీతో కడుపుబ్బా నవ్వించడం.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయం అంటూ అప్పుడే సోషల్ మీడియాలో అప్పుడే ప్రచారం మొదలైంది. ఇంతకీ.. రవితేజతో కలిసి నటించే హీరో ఎవరు..? ఈ క్రేజీ మల్టీస్టారర్ డైరెక్టర్ ఎవరు..? ఈ సినిమా థియేటర్లోకి వచ్చేది ఎప్పుడు..?
మాస్ మహారాజా రవితేజ ఈమధ్య కాలంలో నటించిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర, భర్త మహాశయులకు విజ్ఞప్తి తదితర చిత్రాలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. అందుకనే మాస్ రాజా రూటు మార్చి డిఫరెంట్ స్టోరీస్ తో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారట. డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ కావడం వలనే ఇరుముడి సినిమా చేసారట.. ఇందులో రవితేజ ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని విధంగా అయ్యప్ప స్వామి భక్తుడు పాత్రలో కనిపిస్తుండడం విశేషం. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన అయ్యప్ప స్వామి సాంగ్ విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతుంది.
ఇరుముడి తర్వాత రవితేజ చేసే సినిమా ఇంత వరుకు ప్రకటించలేదు కానీ.. మల్టీస్టారర్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తింది. ఇంతకీ రవితేజ నటించే మల్టీస్టారర్‌లో మరో హీరో ఎవరంటే.. శ్రీవిష్ణు అని తెలిసింది. శ్రీవిష్ణు యాక్టింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక రవితేజ, శ్రీవిష్ణు కలిస్తే.. వేరే లెవల్లో ఉంటుంది. మరి.. ఈ ఇద్దరి కాంబోలో మూవీని డైరెక్ట్ చేసే దర్శకుడు రాజ రాజ చోర, స్వాగ్ ఫేమ్ హసిత్ గోలి. ఇక ఈ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు.
ఈ సినిమాలో రవితేజ నటించే క్యారెక్టర్ గురించి సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. అయితే.. ఆ ప్రచారంలో వాస్తవం లేదని.. రవితేజ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా.. ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్ చేసేలా ఉంటుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇరుముడి మూవీ రిలీజ్ చేసిన తర్వాత ఆగష్టులో ఈ సినిమాని పట్టాలెక్కించనున్నారని టాక్ వినిపిస్తోంది. 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది దిల్ రాజు ప్లాన్ అని తెలిసింది. మరి.. సంక్రాంతికి రవితేజ, శ్రీవిష్ణు కలిసి ఏ రేంజ్లో ఆకట్టుకుంటారో చూడాలి.


