‘జెన్ జీ’ఓటర్లను ఆకర్షించలేకపోతున్న కాంగ్రెస్

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ‘జెన్ జీ’ ఓటర్ల చుట్టూ తిరుగుతున్నాయి. నవతరం ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యత్వ నమోదుతో దూసుకుపోతుంటే.. అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ హడావుడి కనిపించడం లేదు. ఈ నిర్లక్ష్యంపై దక్షిణ తెలంగాణకు చెందిన ఒక సీనియర్ మంత్రి.. పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎదుట వాస్తవాల బాంబు పేల్చారు. పాత పద్ధతులతో కాలం గడపలేమని, యువతపై దృష్టి పెట్టకపోతే ప్రత్యర్థులకు ఆయుధాలు ఇచ్చినట్లేనని కుండబద్దలు కొట్టారు. ఇంతకీ హస్తం పార్టీలో ‘జెన్ జీ’ ఓటు బ్యాంకు పరిస్థితి ఏంటి? సీనియర్ మంత్రి ఇచ్చిన ఈ క్షేత్రస్థాయి రిపోర్టుతో కాంగ్రెస్ అధిష్టానం నయా కార్యాచరణకు దిగబోతోందా?

తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. వర్తమాన రాజకీయం అంతా ఇప్పుడు ‘జెన్ జీ’ యువత చుట్టూ కేంద్రీకృతమైంది. పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల వయసున్న ఈ నవతరం ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. రాష్ట్రంలో యువ ఓటర్ల సంఖ్య ఎంత, వారు అదనంగా ప్రభావితం చేయగలిగే కుటుంబ ఓట్లు ఎన్ని అనే పక్కా లెక్కలతో ఈ రెండు పార్టీలు క్షేత్రస్థాయిలోకి దిగాయి. యువతను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. అయితే ప్రతిపక్షాలు ఇంతలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతుంటే.. అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం అలాంటి సంస్థాగత హడావుడి ఎక్కడా కనిపించడం లేదు. కేవలం అధికారంలో ఉన్నామనే సంపూర్ణ ధీమాతో హస్తం పార్టీ శ్రేణులు భవిష్యత్ ఓటు బ్యాంకును నిర్లక్ష్యం చేస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది.

వాయిస్ వోవర్ 2: సొంత పార్టీలో నెలకొన్న ఈ స్తబ్ధతపై దక్షిణ తెలంగాణకు చెందిన ఒక సీనియర్ మంత్రి రాష్ట్ర అధిష్టానం వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ‘సర్’ అవగాహన కార్యక్రమం ముగిసిన తర్వాత.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో సదరు మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయన వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టారు. కాంగ్రెస్ పార్టీలో అసలు ‘జెన్ జీ’ యువత బలం ఎంత ఉందన్న దానిపై నాయకత్వానికి స్పష్టత లోపించిందని ఆయన వివరించారు. కేవలం సాంప్రదాయ గాంధీ సిద్ధాంతాలను వల్లించడం వల్ల నేటి తరం యువత ఆటోమేటిక్‌గా ఆకర్షితులు కారనే ప్రాక్టికల్ సత్యాన్ని ఆయన అధిష్టానం ముందు ఉంచారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వానికి, పార్టీ సంస్థాగత వ్యవస్థకు మధ్య గ్యాప్ కొనసాగుతుండటాన్ని ఆయన వేలెత్తి చూపారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందని లైట్ తీసుకుంటే.. ప్రత్యర్థులకు రాజకీయ ఆయుధాలు మనమే అందించినట్లు అవుతుందని సదరు మంత్రి నర్మగర్భంగా హెచ్చరించారు.

మంత్రి చేసిన ఈ విశ్లేషణ పార్టీలోని అంతర్గత లోపాలను బహిర్గతం చేసింది. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పదేళ్ల పాటు జెండా మోసిన సాంప్రదాయ కేడర్‌కు అధికారంలోకి వచ్చాక సరైన గుర్తింపు దక్కలేదనే తీవ్ర అసంతృప్తి క్షేత్రస్థాయిలో రగులుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీలో కష్టపడిన వారికి అన్యాయం జరుగుతోందని, ఈ లోపాన్ని గుర్తించడంలో హైకమాండ్ ఫెయిల్ అయిందని మంత్రి స్పష్టం చేశారు. నాయకత్వం తరచూ నిర్వహించే జూమ్ మీటింగుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన కుండబద్దలు కొట్టారు. వందలాది మంది పాల్గొనే జూమ్ సభల్లో ఎప్పుడూ పైస్థాయిలోని ఐదారుగురు నాయకులకే మాట్లాడే అవకాశం వస్తుందని, కిందిస్థాయి కార్యకర్త తన ఆవేదన చెప్పుకునే వేదిక అది కాదని తేల్చిచెప్పారు. దానికి బదులుగా నియోజకవర్గాల వారీగా ‘కోర్ కమిటీ’ సమావేశాలు పెడితేనే గ్రౌండ్ లెవెల్ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ నాయకత్వానికి తెలుస్తుందని సూచించారు. కార్యకర్తలను ప్రాణంలా కాపాడుకుంటామని ముఖ్యమంత్రి చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయి ఆచరణకు మధ్య పొంతన లేదన్న వాస్తవాన్ని మంత్రి సున్నితంగా బయటపెట్టారు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కేవలం గాంధీభవన్ నాలుగు గోడల మధ్యే వ్యూహాలు రచిస్తూ క్షేత్రస్థాయిని విస్మరిస్తోందన్న వాదనకు మంత్రి మాటలు బలం చేకూర్చాయి. కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌ను తిట్టడం వల్ల రాజకీయ ప్రయోజనం ఉండదని.. క్షేత్రస్థాయిలో జనం మనసు గెలుచుకునేందుకు, బీజేపీ సిద్ధాంతాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ఆర్‌ఎస్‌ఎస్ తీసుకుంటున్న నిరంతర చొరవను కాంగ్రెస్ అధ్యయనం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు మాత్రమే కాంగ్రెస్ యాక్టివ్ అవ్వడం, ఎన్నికలు ముగియగానే గ్రామస్థాయి పునాదులను గాలికొదిలేయడం ఒక రోటీన్ సాంప్రదాయంగా మారిపోయిందని ఆయన గుర్తుచేశారు. నేటి నవతరం యువత ‘నియో నేషనలిజం’ పై విస్తృతంగా చర్చించుకుంటున్నారని.. వారి ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ ఒక బలమైన ప్రత్యామ్నాయ నెరేటివ్ సృష్టించకపోతే భవిష్యత్తులో పార్టీకి వాయిసే ఉండదని స్పష్టం చేశారు. పార్టీ పదవుల కంటే ప్రభుత్వ పదవుల వైపే కేడర్ పరుగులు తీస్తుండటం వల్ల.. భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేసే సర్వీస్ మెకానిజం పూర్తిగా పడిపోతుందనే ప్రమాదాన్ని ఆయన పెద్దల ముందు ఉంచారు.

పార్టీ పట్ల సంపూర్ణ నిబద్ధతతో సీనియర్ మంత్రి ముక్కుసూటిగా చెప్పిన ఈ చేదు వాస్తవాలను రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అత్యంత సానుకూలంగా స్వీకరించారు. కిందిస్థాయి నాయకులకు, కేడర్‌కు మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్‌ను వెంటనే సరిదిద్దాల్సిన తక్షణ కర్తవ్యాన్ని వారు గుర్తించారు. పార్టీ సిద్ధాంతం నచ్చి వచ్చిన యువతను పట్టించుకోకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని అరికట్టేలా మేధోమథనం ప్రారంభించారు. పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల వయసున్న యువ ఓటర్లను ఆకట్టుకోవడం, ఉన్నవారిని నిలబెట్టుకోవడం అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అని పార్టీ పెద్దలు ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చారు. ద్వితీయ శ్రేణి నాయకుల్లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించి, వారికి మాట్లాడే స్వేచ్ఛను ఇచ్చేలా సంస్థాగత మార్పులు చేపట్టేందుకు కసరత్తు మొదలుపెట్టారు. సీనియర్ మంత్రి ఇచ్చిన ఈ రియాలిటీ చెక్ ఆధారంగా మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ద్వయం క్షేత్రస్థాయిలో ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తారనే దాని పైనే తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్ మనుగడ ఆధారపడి ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్