తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడును కర్ణాటక మాజీ మైనర్ ఇరిగేషన్ మంత్రి ఎన్.ఎస్.బోస్ రాజు, ఎమ్మెల్యే బసవరాజ్ రాయ్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవన గౌడ బదర్లి కలిశారు. ఈనెల 25న జరిగే తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఆహ్వానం అందించారు. ఈనెల 25న కేంద్రజలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌, ఏపీ, క‌ర్ణాట‌క, తెలంగాణ రాష్ట్రాల సీఎంలతో కలసి తుంగ‌భ‌ద్ర డ్యాం గేట్ల‌ను ప్రారంభించ‌బోతున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక ఎమ్మెల్యేలతో పలు అంతర్రాష్ట్ర జలవనరుల అంశాలపై మంత్రి నిమ్మల చర్చించారు. 2024లో వచ్చిన వరదలకు తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోయింది. దాని స్ధానంలో భారీ వరదలో సైతం స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేశామని నిమ్మల తెలిపారు. స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేసి 80 టీఎంసీలను కాపాడి, రాయ‌ల‌సీమ‌కు సాగు, తాగు నీరందించామని స్పష్టం చేశారు. తుంగభద్ర గేట్లు ప్రమాద భరితంగా ఉన్నాయని నిపుణులు సూచించినా, ఐదేళ్లు జగన్ పట్టించుకోలేదని విమర్శించారు. రాయలసీమ కరువు ప్రాంతానికి జీవనాధారమైన తుంగభద్ర అవసరాన్ని గుర్తించి చంద్రబాబు 6 నెలల్లో కొత్త గేట్ల అమరిక పనులు పూర్తి చేయించారని చెప్పారు. నిపుణుడు క‌న్న‌య్య‌నాయుడి సూచ‌న‌ల మేర‌కు 70 ఏళ్ళ నాటి పాత‌ గేట్ల స్దానంలో కొత్త‌ గేట్లు ఏర్పాటు చేశామన్నారు. ఒక్క సీజన్ లోనే పాతగేట్లు తొలగించి రూ.51 కోట్ల‌తో 33 కొత్త గేట్లు ఏర్పాటు చేయడం దేశంలోనే రికార్డు అని నిమ్మల వివరించారు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్