నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌కు సంబంధించి నాగ్‌పూర్‌కు చెందిన అభ్యర్థికి అబుదాబి పరీక్షా కేంద్రం కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో NTA శనివారం వివరణ ఇచ్చింది. తమ రికార్డుల ప్రకారం, నాగ్‌పూర్ అభ్యర్థికి అబుదాబి కేంద్రం కేటాయింపు అతడి లాగిన్ ద్వారానే ఎంపికైందని వెల్లడించింది.
నీట్ అభ్యర్థి అబ్దుల్లా మహ్మద్ తాలిబ్ తనకు నాగ్‌పూర్, వర్ధా, భండారా కేంద్రాలను ఎంపిక చేసుకున్నప్పటికీ, జూన్ 21న జరగనున్న రీ-ఎగ్జామ్‌కు అబుదాబి (యూఏఈ) కేంద్రంగా అడ్మిట్ కార్డులో చూపించారని ఆరోపించాడు. పరీక్షకు ఒక్క రోజు ముందు ఈ విషయం వెలుగులోకి రావడంతో కేంద్రాల కేటాయింపు విధానంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి.


