రూటు మార్చిన.. గోపీచంద్..

హీరో గోపీచంద్.. ఒకప్పుడు యాక్షన్ మూవీస్ తో మాస్ ని ఆకట్టుకుని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు.. తనకంటూ ప్రత్యేక మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అయితే.. యాక్షన్ నుంచి రూటు మార్చి ఎంటర్ టైనర్స్ చేస్తే.. ఆశించిన సక్సెస్ రాలేదు. దీంతో గత కొంతకాలంగా కెరీర్లో వెనకబడిన గోపీచంద్.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఓ డజను సినిమాలతో నిరాశపరిచాడు. ఇప్పుడు మళ్లీ రూటు మార్చాడు. ఈసారి ఎలాగైనా సరే.. సక్సెస్ సాధించాలని తపిస్తున్నాడు.. కృషి చేస్తున్నాడు.. మరి.. గోపీచంద్ నుంచి రానున్న సినిమాలు ఎలా ఉండబోతున్నాయి..? ఎప్పుడు రాబోతున్నాయి..?

తొలి వలపు అనే సినిమాతో హీరోగా పరిచయమైన గోపీచంద్.. తొలి సినిమాలో నటుడుగా మెప్పించాడు కానీ.. కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు. ఫస్ట్ మూవీ ఫ్లాప్ అవ్వడంతో విలన్ గా టర్న్ తీసుకున్నాడు. జయం మూవీతో విలన్ గా మారాడు. విలన్ గా అతని యాక్టింగ్ కు విజిల్స్ పడ్డాయి. బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ కూడా వచ్చింది. అయితే.. మనసులో ఎక్కడో నేను హీరో మెటీరియల్ కదా అనే ఫీలింగ్ ఉండడంతో… మరోసారి హీరోగా ప్రయత్నించాడు. యజ్ఞం అనే సినిమా చేసాడు. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో హీరోగా మరోసారి జర్నీ స్టార్ట్ చేసాడు గోపీచంద్.

యజ్ఞం తర్వాత ఆంధ్రుడు, రణం అంటూ వరుస విజయాలు. ఒక్కడున్నాడుతో అద్భుతమైన నటన చూపించాడు. లక్ష్యం, శౌర్యం, శంఖం, గోలీమార్ వంటి విజయాలు వచ్చాయి. అయితే.. ఇవి బ్లాక్ బస్టర్స్ కాదు. కానీ గోపీచంద్ ను హీరోగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. అప్పటి వరకూ సీరియస్ మూవీస్ చేస్తూ వచ్చిన అతను లౌక్యం మూవీతో హిలేరియస్ గా ఎంటర్టైన్ చేశాడు. వెంటనే జిల్ తో మరో బ్లాక్ బస్టర్ పడింది. యాంగ్రీ మేన్ అనేశారు కూడా. కానీ ఆ తర్వాతే ఎక్కడో పట్టాలు తప్పాడు. వరుసగా ఫ్లాపులు. కథలు మార్చాడు. పాత్రల్లో కొత్తదనం ఉండేలా చూసుకున్నాడు. అయినా.. విజయాలు మాత్రం రాలేదు.

గౌతమ్ నందా, ఆక్సిజన్, పంతం, చాణిక్య, సిటీమార్, ఆరడుగుల బుల్లెట్టు, పక్కా కమర్షియల్.. ఇలా ఓ డజను సినిమాలు చేసాడు కానీ.. ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ అనేలా సక్సెస్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో భరతవర్ష అనే పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం పై భారీ ఆశలు పెట్టుకున్నాడు గోపీచంద్. ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పాడు గోపీచంద్. యాక్షన్ మాస్టర్ వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 70ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి ఫామ్లోకి రావాలనేది గోపీచంద్ ప్లాన్.

Latest Articles

హీరో విజయ్‌ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు

హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపై నోటీసులు ఇచ్చింది.  HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్